Jump to content

పుట:VrukshaSastramu.djvu/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్ద చింటు:- చిన్న చెట్టు. దీనికిని ముండ్లు గలవు. ముండ్లు మీద ఆకులు పువ్వులు గలవు. కావున నవి కొమ్మలు మారుట చే నేర్పడినవి భావింప వలసి యున్నది. దీని పువ్వులు తెల్లగా నుండును.

నీరజ:- చిన్న చెట్లు ముండ్లు లేవు. ఆకులు అభిముఖ చేరిక. పువ్వులు చిన్నవి. పనుపు గలిసిన ఆకు పచ్చ రంగుగా నుండును.


రేగు కుటుంబము.


రేగు కుటుబపు మొక్కలు ప్రపంచము నందంటను గలవు. ఈ కుటుంబములో బెద్ద చెట్లును గురుబురు మొక్కలును నున్నవి. చాల వానికి ముండ్లు గలవు. ఈ ముండ్లు కణుపు పుచ్ఛములు మారుటచే గలిగినవి. కొన్ని మొక్కలీ ముళ్ళ సాయమున బెద్ద చెట్ల పై నెగ బ్రాకును. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొచము దట్టmuగను biరుసుగను నుండును. పువ్వులు చిన్నవి. కణుపు సందుల నుండి మధ్యారంభ మంజరులుగ బుట్టు చున్నవి. అయిదు రక్షక పత్రములును అయిదు కింజల్కములు గలవు. ఈకింజల్కములు ఆకర్షణ పత్రముల కెదురుగా నుండును. కింజల్కముల మధ్య