Jump to content

పుట:VrukshaSastramu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంకరగా నుండును. పుష్పములు చిన్నవి. రక్షకపత్రములు. ఆకర్షణ పత్రములు, ఐదేసి కలవు. ఆవి కలసి యైనను వివిడివిడిగా నైనను నుండును. కింజల్కపు కాడలన్నియు గలసి ఒక గొట్టము వలె నేర్పడును. ఈ గొట్టము యొక్క లోపలి వైపునే నేర్పడును. ఈ గొట్టము యొక్క లోపలి ఒవైపుననే పుప్పొడి తిత్తులు గలవు. అండాశయము చుట్టు బళ్ళెరము గలదు. అండాశయములో దరుచుగా నైదు గదులుండును.

వేపచెట్టు: మిక్కిలి యుపయోగ మైనది. ఆకులు వువ్వులు కాయలు, గింజలు, వేరులు అన్నియు ఔషదముల లో బనికి వచ్చును. చెట్టు బెరడను, వేరు బెరడును లేత కాయలను కొన్ని జ్వరములకు మంచి పని చేయుచును. వేప నూనె చర్మ వ్యాధులకు మంచిది. ఆకుల కషాయముతో పుండ్లు కడుగ వచ్చును. స్పోటకము మొదలగు వానికిని ఆకుల రసమును బూయుట మంచిది. పువ్వులు అజీర్ణమునకును నీరసమునకు బని చేయును. మరియు వేప కల్లు. క్షయకును, కుష్టునకును కూడ మంచిపని చేయును. ఈ కల్లు ఒక్కొక్కప్పుడు చెట్టు చివర నుండి స్రవించును. ఇట్టి దానినే తీయుటకు చెట్టు మొదట గొంత త్రవ్వి మంచి వేరు మీద నాటు పెట్టి దాని క్రింద నొక పాత్ర బెట్టుదురు. దీనిలోనికి రసము దిగును. వేప కలపయు మిక్కిలి గట్టిగా నుండును. బళ్ళు, నా