పుట:VrukshaSastramu.djvu/162

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వేప కుటుంబము.

వేప చెట్టు మనదేశమందంతటను బెరుగుచున్నది.

ఆకులు:- ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు లేవు. మిశ్రమ పత్రములు, విషమ భిన్నము, చిట్టి యాకులు బల్లెపు నాకారము, మొదలు వంకరగా నుండును. కొన వాలము గలదు. అందున రంపపు పండ్లున్నవి. రెండు వైపుల సన్నగ నుండును.

పుష్పమంజరి:- కణుపు సందుల నుండి రెమ గెలలు పువ్వులు చిన్నవి.

పుష్పకోశము:- సంయుక్తము 5 తమ్మెలు గలవు. తమ్మెకొన గుండ్రముగా నుండును. నీచము.

దళవలయము:- ఆకర్షణ పత్రములు 5., నిడివి చౌకపు నాకారము.

కింజల్కములు: కాడలన్నియు గలిసి యొక గొట్టము వలె నేర్పడి యున్నవి. ఈ గొట్టము లోపలి వైపున పుప్పొడి తిత్తులున్నవి.

అండకోశము: అండాశయము, ఉచ్చము. 3 గదులు. అండాశయము చుట్టు బళ్ళెరము గలదు. కీలము ఒకటి, సన్నముగానుండును. ఫలము లో పెంకు కాయ.

ఈకుటుంబములో విస్తారము వృక్షములే గలవు. ఆకులకు గణుపు పుచ్ఛము లుండును. ఒంటరి చేరిక, సాధారణముగ పక్ష వైఖరిగ నుండును. చిట్టి యాకుల మొదలు