ఆకర్షణ పత్రములైదు. కింజల్కములు పదియో అంత కంటే నెక్కువగానో యున్నవి. అండాశయమునందు గదులు చాలగలవు. ఫలము కండ కాయ.
నారింజచెట్లు:- ఉష్ణ ప్రదేశములలో బెరుగును. ఇవి మనదేశములో చాల చోట్లనే పెరుగు చున్నవి గాని వీనికంటె గమలాఫలపుచెట్లు నెక్కువ శ్రద్ధతో పైరు చేయుదురు. ఇవియు, బత్తాయి నారింజయు వేరు వేరు తెగలు. వీనిలో మనము తిను ముత్యములు కాయు ముదరనప్పుడు, అండాశయములో రోమములవలె గనుపట్టును.
కమలాఫలపు గింజలను మళ్ళలో నాటి మొక్కలు ఒకటి రెండడుగులు లెదుగ గానె తీసి దూరముగ పాతుదురు. ఏడెనిమిది సంవత్సరములు వచ్చిన తరువాత కాయలు కాయ నారంబించును. ఇవి నాగపూరు ప్రాంతముల సంవత్సరమునకు రెండు కాపులు గాయుచున్నవి.
బత్తాయి నారింజ:- చెట్లను నిట్లె పెంతురు. వీని పండ్లు మిగిలిన వాని కంటె చాల నారోగ్యము. నారింజలలో పండ్లచర్మములను ఔషదములలో వాడుదురు. ఈ గింజల పొడిని మూత్ర వ్యాధులు