పుట:VrukshaSastramu.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ్చుటకు శీతోష్ణ స్థితి గతులను బట్టి పది మొదలిరువది దినములవరకు బట్టును. అప్పుడు కట్టలను రోకళ్ళ వంటి వానితో గొట్టి నారను లాగి, నీటిలోనే గడిగి యార బెట్టుదురు. నార దీయుటకు యంత్రములున్నవి గాని వాని యవస్య మంతగ లేదు. చీక బెట్టి నార దీయుట వలన నంత చేటు ఖర్చును గాదు. మరియు మరలను గొనుట మాటలతో బని కాదు. డబ్బు పెట్టుబడి పెట్టుట కష్ణము. నారను శుబ్ర పరచి రకములగ నేర్పరచెదరు. ఈ నారతో మృథు వస్త్రములను, చొక్కాలకు బనికి వచ్చు బట్టలును ముతక బట్టలను గోని సంచులును నేయుచున్నారు. ఈనార తోడను, నారతో చేసిన వస్తువుల తోడను జేయు వ్యాపారము వలన మన దేశమునకు లాభమే కలుగు చున్నది.

ఈ మొక్క పచ్చి యాకుల అరసము పిండియు, ఎండాకులతో గషాయము గాచియు శగ రోగము, మూత్ర కోశ రోగములకు నిత్తురు.

పయిరు:- మొక్క ఆడవులలో బెద్ద చెట్ల నానుకొని పెరుగును. ఆకు అండాకారము అంచున రంపపు పండ్లు గలవు.

అల్పయరు:- కొండల మీద బెరుగు గుబురు మొక్క ఆకులు బల్లెపాకారము.