Jump to content

పుట:VrukshaSastramu.djvu/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూతకి:- గుబురు మొక్క ఆకులు బల్లెపాకారము మూడు పెద్ద యీనెలున్నవి. ఆకుల కడుగువైపున రోమములు గలవు. కణువుపుచ్చములున్నవి.


మదనగింజల కుటుంబము.


ఈ కుటుంబములో గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంతరి చేరిక, లఘు పత్రములు, సమాంచలము, కొన్నిటికి గణుపు పుచ్చములున్నవి. పుష్పములు మిధునములు, సరాళము, రక్షక పత్రములు 5 ఉండును. కొన్నిటిలో నివి అడుగున కలిసి యున్నవి. మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు 5; కొన్నిటిలో మాత్రము 4 రక్షక పత్రములు, 4 ఆకర్షణ పత్రములు, గలుగు చున్నవి. ఆకర్షణ పత్రములు వృంతాశ్రితములు ఇవి మెలివెట్టి నట్లుండును. కింజల్కములు ఆకర్షణ పత్రములన్ని యుండును. గొడ్డు కింజల్కములు కూడ గలవు. కింజల్కముల మధ్యనైదు గ్రంధి కోశములున్నవి. అండాశయములో 3.....5. గదులుండును. కీలములు 3....5 గింజలపై పొర తరచుగా రెక్కల వలె వెడల్పై యుండును.

మదనగింజలు:- మొక్కలను హిందూస్థానము నందెక్కువగా బెంచు చున్నారు. ఈ మొక్కయు నన్నిపైరుల వ