పుట:VrukshaSastramu.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కింజల్కములు:- అన్నియు గలసి గొట్టమువలె నేర్పడి చివర మాత్రము విడివిడిగా నున్నవి. పుప్పొడి తిత్తులందు నొకగది మాత్రమే గలదు.

అండకోశము: .. అండాశయముచ్చము. పలు గదులు కాయకానడు స్త్రీ పత్రములు 15-20 ఫలము విచ్చెడు కాయలవలె నుండును గాని స్త్రీపత్రములు బ్రద్దలై గింజలు బైటకు వచ్చును.

ఈ కుటుంబములో గుల్మములు, గుబురు మొక్కలు చెట్లును గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములో తాళ పత్ర వైఖరి నున్నమిశ్రమ పత్రములో గలవు. కణువు పుచ్ఛములున్నవి. లేత కొమ్మలపై మెత్తని రోమములును గలుగు చుండును. పుష్పములు పెద్దవి. ఒంటరిగా నుండును. రక్షక పత్రములు ఆకర్షణ పత్రము లైదేసి గలవు. కింజల్కములన్నియు గలిసి యుండును లేదా కొన్ని కొన్నియైన గలసియుండును. అడుగున దశవలయము నంటియుండును. పుప్పొడి తిత్తులోక్కొకగది. అండాశయములో జాలగదులున్నవి . కాయ పగులును. లేదా, విచ్చును.

బెండ:.... మొక్కలకు నెరువు ఎక్కువగ కావలయును. కొన్నిచోట్ల గింజలనొక మడిలో జల్లి లేత మొక్కలను దీసి దూర దూరముగ బాతుదురు. ఒకరకము గింజలు చల్లి