పుట:VrukshaSastramu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న నాలుగు నెలలకే కాయలు గాచును. ఒక రకము చాల నెలలకు గాని కాయదు. ఎకరము నేల మొక్కలు వేయుటకు సుమారు అయిదు రూపాయలగును. లాభము ఎకరమునకు దొమ్మిది పది రూపాయలు మాత్రము వచ్చును. ఇవి ఒక చోటనే సంవత్సరమునకు రెండు పంటలు కూడ బండును. లేత బెండ కాయలను గూరవండుకొనుదుము. బెండ మొక్కనుండి మంచి నారయు వచ్చును. కాని దానిని దీసి ప్రత్యేకముగ నమ్ముటలేదు. కొన్ని చోట్ల మాత్రము కొంచమో, గొప్పయో దీసి గోగు నారలోను జనుప నారలోను గలుపుచున్నారు. బెండ కాయలోను గింజలందును నున్న జిగురును ఔషదములలో వాడుదురు.

కస్తూరి బెండ:.... గింజలు సువాసన వేయును. వీనిని పరిమళముగా నుండు నూనెలు చేయుటలోను ఔషధములలోను వాడుదురు. ఈ మొక్క నుండియు మంచి నార వచ్చును.

ప్రత్తి:... మొక్కలు పెంచుటయు నూలు దీసి బట్టలు నేయుటయు మన దేశములో జిరకాలమునుండి కలదు గాని ఐరోపియనులు మూడు వందల సంవత్సరముల క్రిందట దాని యుపయోగము లంతగానెరుగరు. అమెరికా దేశములో బండించుటకు పూర్వ మింగ్లాండునకు నూలు మనదేశ