Jump to content

పుట:VrukshaSastramu.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుష్పమంజరి:- కౌణుపు సందుల నొక్కొక్క పుష్పము గలదు. పువ్వు పెద్దది. లేత పశుపు రంగు, అడుగున కొంచెము ఊదారంగుగ నుండును. వృంతము పొట్టిది. చేటికలు మరియొక పుష్ప కోశము వలె నేర్పడు చున్నవి.

పుష్పకోశము:.... సంయుక్తము, ఒకప్రక్కన చీలును. మృదువుగా నున్నది. నీచము.

దళవలయము:.... అసంయుక్తము. అడుగున కొంచము మాత్రము కలసి యుండును. 5 ఆకర్షణ పత్రములు, మెలిపెట్టియుండును.

కింజల్కములు: అన్నియుగలసి కీలముచుట్టును గొట్తమువలె నేర్పడు చున్నవి. పుప్పొడి తిత్తులు చాల గలవు. కాని ఒక్కొక్క దాని యందొక్కొక్క గది మాత్రమున్నది.

అండకోశము:.... అండాశయము ఉచ్చము, సాధరణముగ నైదుగదు లుండును. ఒక్కొక్క గదిలో నొక్కొక్క వరుస గింజలు గలవు. కాయ ఎండి పగులును. కీలము గుండ్రముగాను, బొడుగుగాను నుండును. ఎన్ని గదులున్నవో అన్ని కీలాగ్రములు గలవు.

తుత్తురుబెండ పలు చోట్ల బెరుగును గుల్మము.

ఆకులు:.... ఒంటరి చేరిక, లఘుపత్రములు, హృదయాకారము, ఇంచు మించు సమాంచలము. వాలము గలదు. ఈనెలు తాళపత్ర వైఖరినున్నవి.

పుష్పమంజరి:.... కణుపు సందుల నొక్కొక పుష్పముండును. ఆ తొడిమ కంటె వృతము పొడుగు. పుష్పము సరాళము సాయంత్రము వికసించును. వృంతము చివర నతుకుగలదు.