పుట:VrukshaSastramu.djvu/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్పూరతైలములో గలిపిన మంచి వార్నీషు అగును. దీనినే కొబ్బరి నూనెలో గలిపి క్రొవ్వువత్తులు కూడ చేయవచ్చును. తెల్లడామర గింజలనుండి వచ్చు చమురుకూడ క్రొవ్వు వత్తులు చేయుటకు బనికి వచ్చును. ఈ చమురు నొక కప్పుడు నేతిలో కలిపి దగా చేయుచుందురు. దీని బెరడు వగరుగా నుండును. కల్లు పులియకుండ కొన్ని చోట్ల దీనిని వేయు చుందురు. కలప గుగ్గిలపు చెట్టు కలపంత మంచిది కాదు.

నల్లడామర:.... ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.


బెండ కుటుంబము.


బెండ మొక్క మంచి నేలలం దారడుగులవరకు బెరుగును; లేత భాగములందు గ్రుచ్చుకొను నూగును గొంచము నీలముగా నున్న మచ్చలును గలవు.

ఆకులు:.... ఒంటరి చేరిక, లఘు పత్రములు, కొంచము పైగానున్న యాకులు చీలియున్నవి. చివర వానికి బెద్ద తమ్మెలు గలవు; తాళపత్ర వైఖరి. అంచున రంపపుపండ్లున్నవి. కరుకుగానున్న రోమములును గలవు. తొడిమ పొడుగు. కొమ్మ ఆకుకంటె నెర్రగానుండును. రెండుకణుపు పుచ్ఛములు గలవు.