Jump to content

పుట:VrukshaSastramu.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

టకు దీనిని పొగవేయుదురు. పడవలు, ఓడలు కట్టుటలో దీనినుపయోగింతురు. దీని బెరడు తోలుబాగుచేయుటకుకూడ పనికివచ్చును.

గుగ్గిలపు కొమ్మ.

తెల్లడామర:.... చెట్టుపెద్దదియె. దీనియాకులు నగోళాకారము. దీని నుండియు గుగ్గిలము వంటిది వచ్చును. దీనిని గూడ గుగ్గిలము వలె నౌషధములలో వాడుదురు. దీని