పుట:VrukshaSastramu.djvu/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

93

ఆరుదొండ:... దేనిపైనైనను నెగ బ్రాకు గుబురు మొక్క. దానికి ముళ్ళుగలవు. పువ్వులు కణుపుసందుదగ్గర నొకదానిపై నొకటి యుండును. దీని వేరు, ఆకుల కషాయము డోకులను కట్టించును. అన్నహితవును గలుగ జేయును.

పలికి
.... చిన్న గుబురు మొక్క. కణుపు పుచ్చములు ముళ్ళవలె మారియున్నవి. ఆకులు లఘుపత్రములు. పువ్వులు పోచ్చగ నుండును.
పట్టతీగె
.... కొండలమీద బెరుగు పెద్ద తీగె. ముళ్ళు లేవు. ఆకులు అండాకారము. పువ్వులు పెద్దవి. కింజల్కములు చాల కలవు. కాయ కండ కాయ.
ఆగుబ
.... తీగ అడవులలో బెరుగును. దీనికి ముళ్ళుగలవు. పువ్వులు తెల్లగ నుండును. పచ్చని చారలును గలవు.
గులి
.... చిన్న చెట్టు. ముళ్ళుగలవు. దీనికలపయు గట్టిగానుండుడు.

నీరద కుటుంబము.


ఇది యొక చిన్న కుటుంబము. దీనిలో పెద్ద చెట్లు గుబురు మొక్కలును గలవు. ఆకులు లఘుపత్రములు, ఒంటరి చే