Jump to content

పుట:VrukshaSastramu.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కుటుంబమునందు గుల్మములు, గుబురు మొక్కలు చెట్లును గలవు. ఆకులు ఒంటరి చేరిక, లఘుపత్రములు గాని తాళ పత్ర వైఖరినున్న మిశ్రమ పత్రములు గాని గలవు. కొన్నిటిలో గణుపు పుచ్చములున్నవి. కొన్నిటిలో నవి ముళ్ళవలె మారి యున్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు నాలుగేసి యుండును. సాధారణముగ గింజల్కములెక్కువగా నుండును.అండాశయము ఒక జాతి మొక్కలందు దప్ప మిగిలిన వాని యందు గింజల్కముల మధ్య నుంది పైకి వచ్చిన వృతాగ్రము పై నున్నది. అండములు రెండు వరుసలు. కుడ్య సంయోగము. కీలము లేదు.

వాయింటగింజలను ఆకులను వేరులను ఔషధములలో వాడెదరు. కడుపులో నుండి ఏలుగపాములు మొదలగు పురుగులను బోగొట్టుటకు గింజలను పొడుము చేసి పంచ దారతో కలిపి పుచ్చుకిందురు. ఆకుల రసము చెవిపోటును బోగొట్టును గాని చెవి మంట పెట్టును. వేరును ముక్కలుగా గోసి కషాయము గాచి జ్వరమున కిత్తురు.

మావలింగ్దము బెరుడుతో గషాయము గాచి మూత్ర విసర్జన మప్పుడు కలుగు మంట మొదలగు వ్యాధుల కిత్తురు. ఆకులను నిమ్మకాయల రసముతో నూరి పట్టు వేసిన గొన్ని చర్మ వ్యాధులును బోవును.

కుక్కవాయింట:.... మొక్కలు పలు తావుల బెరుగుచున్నవి. ఆకులు మిశ్రమ పత్రములు. పచ్చని పువ్వులు పూయును. దీనిని వాయింట మొక్క వలెనే నుపయోంచుచు