పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

విజయనగర సామ్రాజ్యము


రుణ జగ :-ప్రియవస్తుదర్శనమున కిష్టపడని వారుందురా ?

స్వర్ణ :-నీకుఁబ్రియమైన వస్తు వేది ?

జగన్మోహిని యోచించెను. ఆమె కేమియుఁ దోఁచినది కాదు. చివరకిట్లనెను.

“నీ కేది ప్రియమో నాకు నదియే ప్రియము'.

స్వర్ల : నాకుఁ బరిహాసము మిక్కిలి ప్రియమైనది. ఇది నీకుఁ బ్రియముకాదు. ఒకరికిం బ్రియవస్తువు మఱి యొకరికీ బ్రియమగునా ?

ఆ మెకుఁ బ్రత్యుత్తరము తోఁప లేదు. నిశ్చలభావము వహించి యూరకుండెను. కాని యిట్లనుకొనెను.

ఆ ప్రియవస్తు వేమై యుండును ? ఈమె మొగము తీరు చూడఁగా నాకు విజయసింహుని దర్శన మే మోయని సం దే హము పొడముచున్నది. అతనిజూచి చిరకాలమైనది. మన స్సతని పునర్దర్శనమున కువ్విళులూరుచున్నది. కాని యదృష్ట విదూరనగు నాకంతటి భాగ్యమా ? ”

స్వర్ణ :-ప్రియవస్తువునే చెప్పఁజాలని వారికిఁ దత్ప్రియదర్శన మెటగును?

జగ: కానిమ్ము. ఆ ప్రమేయముమాని కొంచెము సేపిచట నుందమురా!

స్వర్ణ : ఇచటనుండుట నాకు సంతోషము లేదు.