పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

53


జగ:-ఎందుచేత?

స్వర్ణ : త తైయసందర్శనముఁగూర్చి నీకు మోదము కూర్ప కుండుటచేత.

ఆమె కాశలు కల్లెను కాని నిశ్చయము లేదు. స్వర్ణ కుమారి ఆపె కంతకంటె నేమియుఁ జెప్పి నది కాదు. ఆమెమనను డోలికవలె నూగులాడఁజొచ్చెను.

స్వర్ణ :-- వెళ్లుదమురా ' అనియెను.

ఆమె లేచినది. సమనోరధమై కదలు చిత్తముతో స్వర్ణ కుమారిని వెంబడించినది. వారిరువురు ప్రఫుల్ల కుసుమ సందోహ విరాజితములగు వల్లుల మధ్యముగను, దర్శనీయము లగు రసాలముల మధ్యగను మెల్ల మెల్లగ నడచి సంధ్యాసమ యమగుడు నల్గడల వ్యాపించుచున్న లేజీ కట్లలోఁ గ్రమక్రమ ముగా దృష్టి పథమునుండి తొలఁగిపోయిరి.