పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము

ఢిల్లీ కి బ్రయాణము


రజనీ కాంతధరించిన నీలవస్త్రమువోలె సెల్లడలం జీకట్లు వ్యాపింపఁదొడఁగెను. మృదుమధురావ్యక్తల నిస్వనంబులు మీర విహంగములు వృతములనుండి శ్రవణానందముగా గూయుచుండెను. రజనీసుందరి విశ్రమించు మంచము యొక్క పందిరియో యన నాకసము శోభిలుచుండెను. చుక్క- లందలి పాదరసపుబుడ్లకరణిఁ బ్రకాశించుచుండెను.

అట్టియెడ విజయనగర పట్టణములో నొక చోటఁ బ్రాసా దముమీఁద నొక మానవ విగ్రహము పికారు సేయుచుం డెను. అతని 'మొగ మతిగంభీరముగాఁదోఁచుచుండెను. అతని వయ సరువదియేండ్లకు మించియుండును. మీసములు నెరసినవి కాని యే వో నల్ల నిరంగులు వానినన్తమును మార్చినట్లు కాన వచ్చుచున్నది. . అతఁడొక యుత్తమవంశీకుల రాజువ లెఁ దోఁచుచుండెను. అతఁడే మన సామ్రాజ్యమునకు నాధుఁడు. చక్రవర్తి. అతఁ డేదో దీర్ఘ ముగనాలోచించు కొనుచుండెను.. అతఁడున్న యీభవనమున నే చక్రవర్తికిఁ గల రహస్యవ్యవహా