పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

విజయనగర సామ్రాజ్యము


రము లాలోచింపఁబడును. యుద్ధ విషయములు మొదలగు సంశముల నిందుఁ జర్చింతురు.

అతఁడింకను నాలోచించుకొను చునుండెను. ఇంతలో నొక మానవ విగ్రహము రంగస్థలమునకు, వచ్చెను. అతఁడు మనరామరాజునకు సలాముచేసెను. రామరాజు కను సన్న సేసి కుర్చీపై (గూరుచుండెను. ఆ నూతన విగ్రహమును గూర్చుండెను.

రామ: ఆదిల్ శాహా ! మఱి గోల్ కొండవార్త లేవియు వచ్చుట లేదేమి?

ఇది:-చిత్తము. రాకేమండి. ఎప్పటీవార్తలప్పుడే వచ్చుచున్నవి.

రామ:-విశేషము లేవేని గలవా ?

ఆది:-చిత్తము. సంతోషకరమైన వార్తలే గలవు.గోల్కొండ రాజ్యములో నంతఃకలహములు ప్రారంభమైనవి.

రామ:-ఏమి ! అంతఃకలహములా ! ఎట్లుసంభవించినవో తెలిసినదా?

ఆది: చి త్తము. సాంతముగాఁ జెప్పెదను. ఆ నవాబు మిక్కిలి పాపవృత్తిగలవాఁడని మీ రెఱుఁగుదురుగదా! అతనికి దారానాధుఁడను మంత్రికలఁడు. ఆయన పుత్త్రిక మిక్కిలి చక్కనిది. ఆమెను దనకిమ్మని నవాబు నిర్బంధించి నానా విధముల బాధించెను.