పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము

13


శాహా తన కుట్రలోఁ జేరడని యెఱిఁగి విజయసింహు నెటు లైనఁజంపఁబ్రయత్నము సేయుచున్నట్లు పొడికట్టుచున్నది. అతఁడు నేఁడు శృంగార పురమునకుఁ బోవుచున్నాఁడు. దారిలో సతని. కేయాపదయు రాకుండఁ జూడవలయును. నీ విప్పుడేపోయి యతనింగలసికొమ్ము. తక్కిన విషయ ములు తర్వాత మాటలాడు కొందము.

శ్రీధ:-సరే. నేఁబోయెదను. నీవును, ఈ దారినిబొమ్ము .

బుద్ధి సాగరుఁడు తలయూ చెను. శ్రీధరుఁడు నిష్క్రమిం, చెను. బుద్ధిసాగరుఁడును ముందడుగు వైచెను. తలను బై కెత్తి ఆకసమువంక దృష్టి సారించెను. “దేవా ! విజయనగర సామ్రా జ్యమును రక్షింపుము' అని యతని పెదవు లుచ్చరించు. చున్నట్లుగఁ జరించుచుండెను.