పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

విజయనగర సామ్రాజ్యము


శ్రీధర:-నిజమే. ఆ! ఈవిషయముల నేని రామరాజు తల పోయ లేదు గాఁబోలు.

బుద్ధి:-ఇదియెల్ల గమనించి చూడ నాకుఁ దురుష్క రాష్ట్రముల నా రెల్ల గలిసి విజయనగరము పైకి వత్తురను నమ్మిక నొడ ముచున్నది.

శ్రీధర:- ఈ తంత్రము లెల్ల నితఁడు కడు చమత్కృతితో నడుపు చున్నట్లు తొంచుచున్నది. మంచిది! దినదినము నా శిష్యుల నంపి వార్తలనెల్లఁ దెప్పించుచుందును. "కాని, నీవు మాత్ర ము మిక్కిలి జగ రూకుఁడవై మెలంగ వలయును జుమీ ! వారు నీ కేమేని హాని సేయుదురని నాకు భయము వొడము చున్నది. ఆహాహా ! యెంతపని జఱుగుచున్నది ! ఎంతపని జఱుగుచున్నది! కానిమ్ము. వీరిపని నెల్ల ను విఘ్నము సేయఁ జాలిన తంత్రమే దేనిలేదా ?బొందిలోఁ బ్రాణ మున్నంత. వఱకు నా కే హానియుఁ జేయఁజాలరు. విజయనగర సామ్రాజ్య రక్షణకు నా ప్రాణము వలయు నేని సంతోష పూర్వకముగా నొసం గెదను. నా కంతటి భాగ్యముగూడునా ?

శ్రీధ:-సరే. కర్తవ్య మేమి ?

బుద్ధి:-శిష్యుల నాయాస్థలములకుఁ బంపి తెలిసికొనుట మొద టిది. రెండవ దత్యం తా వశ్యకమగు విషయము. ఆదిల్