పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

విజయనగర సామ్రాజ్యము


అతఁడు శత్రువుల సేనాధిపతులను యోధులను అతిక్ర మించెను. భటులను ద్రుంచెను. గజములను సంహరించెను. యావనుల హరించెను.


ఇట్లు నిరాఘాట పరాక్రమమున మించి, యతఁడు అహ మ్మద్ నగరు నవాబుపై బడెను. శత్రువుంలందరు చెల్లా చెద రయి పోయిరి. అతనితో గూడఁ గొందఱు యోధులుండిరి? ఆయోధులు శత్రుపక్షమువారి యోథులు బోరందొడంగిరి. విజయసింహుఁ డహమ్మద్ నగరు నావాబు కడకంబోయెను. అతఁ డదిచూచి పాఱిపోయెను.


అహమ్మద్ నగరు బేదరు సనాబల యోధులలో సాలబత్ జంగు, హుసనల్లీ, ఇస్మాల్ ఖాన్ మొదలగుని వారు నిజృంభించి హిందువుల నూఁచకోత కసిరి.


కాని విజయసింహ సాలబత్ జంగులకు ఘోరయుద్ధం బాయెను. సాలబత్ జంగు విజయసింహునిమీఁది. కెగిరి యొక పోటు దీర్ఘ ఖడ్గమునం బొడిచెను. అది యతని హస్త మునం దగిలెను.


ఆ దెబ్బతో మూర్తీభవించిన పౌరుష రాశియోయన నతఁడాతని పై బిల్ల పిడుగువలె నెగిరిపడి గట్టిగా జుట్టుకొని బంధించి వైచెను. అతఁడు తప్పించుకొసంజూచెను. కాని విజయ సింహుఁడతని శిరముం దునిమెను.