పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యె ని మిద వ ప్రకరణ ము

వి జ య ము

. కాని భారత యుద్ధమున భీష్మునింగూర్చి చదివితిమి. యా భారత పితామహునికంటె నెక్కుడువాఁడు తరువాత జన్మింపనే లేదని పెక్కురు పేర్కొనుచున్నారు. కాని తలికోట యుద్ధమున మధ్యందిన మార్తాండునివలె ప్రకాశించు రామ రాజుం దిలకించిన వారెవరు నా మాటలను నమ్మఁజూలరు. అతని కిప్పు డెనుబదేం డ్లుండును. కాని యౌవనుని విధమున విజృంభించి యా యుద్ధమున శత్రు సంహారముం జేయ సైనికు లను యోధులను ప్రోత్సాహించుచున్న ఫుడా దివ్యపురుషుని మనము చూచితిమేని మన మే స్థితిని వహింతుమో యీ శ్వరుని కెఱుక.


విజయ సింహుఁడు తాను చేసిన యుద్ధమును సరిగా స్వర్గమునందుండు దేవతలే వర్ణింపఁజాలరు. ఎక్కడఁజూచిన సతఁడే.. ఎక్కడ విన్న నతని పౌరుషమే-ప్రతాపమే- తేజమే. నాఁడు. విజయసింహుఁ డొక్కఁడుకాడు. ముగ్గురు, నల్గురు, పదుగురు, నూల్గురు వేయిమంది ఏమూలఁజూచిన నతఁడే.