పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యేడవ ప్రకరణము

283


కడసారి ప్రయత్నముగా నతఁడొకసారి తన ఖడ్గమును విసరెను. కాని అది వమ్మాయెను.


అతని కనులనుండి నీరు స్రవించెను. ప్రాణము పోవునని యతఁడు లోలోన నేడ్వసాగెను. ఏమిచేయుటకును దోఁచలేదు.. అతఁడు చేసిన ద్రోహములను, పాపములను సతండు స్మరిం చెను. దుఃఖంచుచుండెను. ఈ యుద్ధము తనకొఱకే వచ్చెనా యేమి యని యతఁడు పరితపించుచుండెను.


అతని సైన్యములన్నియు నావఱకే పాఱిపోయెను. కాని యింతలో నొక తురుష్క వీరుఁ డచ్చటికి పరుగెత్త వచ్చి యా తిరుమల రాయుని హస్తము నున్నట్లుగాఁ దెగ నఱకెను. వేటుతిన్న పెద్ద పులివలె రెండవచేతం గత్తింగై కొని యా తురుష్కుంబొడిచి విజృంభించెను. ఇంతలో, ఆదిల్ శాహా పాఱి పోయెను.


రాధాకుమారుఁ డతనిని వెంబడించెను కాని యిం తలో నతని నొకతురుష్క యోధుఁ డడ్డగించెను. రాధా కుమారుఁ డతనితల నొక నిముసములో స్వయతీ కరవాల ధార కర్పణము చేసెను. అతనిమూర్తి, తేజోవంతమైయుండెను. ఆ నాఁడు నిజము గా బ్రపంచనుం గలిసివచ్చినను అతనిం జయించుట దుర్లభముగా నుండునుండెను. అతనిశరీరము రక్తసిక్తమై యెఱగా" బ్రకాశించుచుండెను. కన్ను లెఱ గాఁజింత