పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

విజయనగర సామాజ్యము


ఆదిల్ శాహా సైన్యము నాల్గుమూలలను దిరుగం జొచ్చెను. ఆ సమయమున నతనిని తిరుమల రాయ లడ్డగిం చెను. ఆదిల్ శాహాను గాపాడవలయునని పెక్కంక్కడ్రు తురు ష్కులుచేరి ప్రాణముల నొసంగుచు దిరుమల రాయని సమీ పించుచుండిరి. హిందూ యోధులు వారి నడ్డగించి తరుము చుండిరి. అచ్చటకు రాధాకుమారుడు చేరి శత్రువుల తలలను బంతులు సఱికినట్లు సఱుకుచుండెను. తిరుమలరాయలు గొట్టు దెబ్బల నన్నింటిని ఆదిల్ శాహా సహించుచు నతని ఘోర ముగాఁ బోరుచుండెను. కాని వేంకటాద్రి యతని యేసుంగుం జంపివైచెను. అతఁడు క్రిందికి దుమికి ప్రాణంబులను సురక్షింపం బూని పర్పిడుచుండెను.

తిరుమలరాయ లతనింబట్టుకొని ఓరీ! పాపాత్ముఁడా! హీనుడా ! కుక్కా ! నిన్న మొన్నటివఱకు. తండ్రీ ! తండ్రీ ! యని మాయన్న గారిం బలుచుచు శత్రువులతో గలిసి 'నేఁడు యుద్ధమునకు వచ్చితినా ? 'నేటితో నీ పాపములు సర్వము తగిన ఫలము సందుచున్నవిలే. నీవంటి పితృద్రోహులకుఁదగిన శిక్ష యీశ్వరుఁడు చేయకుండునా , అది యీలోకముననే నీకు దిద్దించు చున్నది. విజయ నగర సామ్రాజ్యము చేసిన సాయమువలనఁ బెక్కుయుద్ధములలో విజయంబుగాంచి యింతవాఁడవై యిట్టి ద్రోహముఁ జేయుదువా! మాత్రు ద్రోహీ ! ఇదిగోఁ జచ్చితిని' అని ఖడ్గముసు బైకెత్తెను.