పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

విజయనగర సామ్రాజ్యము


దుచే సంధి నాశమగును. మనయందజ లాభము కొఱకును విజయనగర సామ్రాజ్య వినాశము కొఱకును "నేనీ మాత్రము సహింపఁజాలనా ! పిదప విజయము మనకుఁ జేకూరుటయు నాపె సిద్ధించుటయు నెట్లీనికలదు. విజయము శత్రువుల దైనచో, ఆ పై మన కెట్లును సిద్ధింపదు. మనకు వినాశము తప్పదు. ఇంతలో మనమింత త్వరుపడు టుచితముకాదు. కావున దీనిని మనము వదలుకొంటయే మంచిది. నా సందేహము లేదు

బేదర్ నవాబునకును, అహమ్మద్ నగరు నవాబున కును, ఇది సమ్మతమే. ఏలయన ? జగన్మోహినిం గోరిన యెడల శత్రుసమూహదుర్భరమయిన యాంధ్ర జాతీయ ప్రతాపవహ్ని మరల నొకపరి విజృంభించి తమ్ము కాల్చి వేయునని వా రెఱుం గుదురు కాన వారు మఱిమాట్లాడలేదు.

ఆదిల్ : అది తమ చిత్తము.

గోల్కొండ:-నాకా ప్రమేయ మెత్తకుండుటే యిష్టము.

బేదర్ : సరే. వారట్లు స్పష్టముగాఁ జెప్పుచున్నపుడు మనము వేబొకవిధముగా నుండఁదగదు.

ఆదిల్ : మాయిష్ట మే యనుసరింతము. అహమ్మద్ : మనకు గుఱ్ఱములు తక్కువ. ఇది వా రెఱుంగు దురు. అవి మనము కోరవలయును. 15,000 గుఱ్ఱములు కోరినంజాలును. .