పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

233


జనించెను. ఆమెపోక కతఁడు చింతించినచింతకు మేరలేదు. నిద్రించినను, మేల్కొన్నన, మాట్లాడుచున్నను, లేచు చున్నను, చూచుచున్నను, ఆ సుందరి యతనికి ప్రత్యక్షమగు చుండును.

అహమ్మద్ :- అవు నిది యత్యంతావశ్యకమగు నంశము. గోళ్కొండ:. దీనివలనఁ బ్రకృతము చెడునేమో ! ఆంధ్రులు పౌరుష ప్రధానులు. ఈ మాటవిన్నచో సంధిగింధి విడచి మీఁదఁబడుదురు. పైనంజింతించినఁ బ్రయోజనముండదు. అల్లాదయవలన మనకు జయముగల్గినపుడు విజయనగర పరి పూర్ణ లక్ష్మితోఁగూడ జగన్మోహిని మనకు దొరకును. కావునఁ బ్రకృతభంగము చేయునట్టి దానికి మనము పోవ కుండుటే యుక్తము.

ఆదిల్ శాహా కీ 'వాక్యము లమృతోపమానములు. అతఁడు కోరిన దిట్టి ప్రత్యుత్తరము నే.

బేదర్ : వారి కిట్టికోపము కల్గుటయు, కార్యవిఘాతుక జనిం చుటయు సత్యమే. అయినను ఇది యత్యం తావశ్యకము గదా?

ఆదిల్ : ఒక వేళ నట్లు కావచ్చును. కాని మాయిష్టము.

గోల్కొ: నాకు దాని నిందుఁ జేర్పకుండుటయే యిష్టము. ఆ మాట విన్నంతనే ఆ వీరులకుం గోపము జనించును. అం