పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

విజయనగర సామ్రాజ్యము


అట్టి తురుష్కులను రమారమి రెండువందల వత్సర ములనుండి తెగనఱికి దక్షిణ హిందూ దేశమున విజయనగర సామ్రాజ్యము ధర్మసంస్థాపన చేసినది. నీ పూర్వుల పవిత్ర రక్తము నీయందుం బ్రవహించునేని శత్రురాజులను ధ్వం సముచేసి విజయనగర సామ్రాజ్యమును ఢిల్లీ సామ్రాజ్యము నుగాఁ జేయుము. యుద్ధమునం దభిమన్యునివలె వర్తించి ఖ్యాతిం గడించుము.” అని చప్పున నాలుక కొఱుకు కొనెను. “నాయనా ! ఒక ముద్దు పెట్టిపొమ్ము' అని చెక్కిలి నొక్కి ముద్దు పెట్టుకొనెను. అతఁడు సెలవు గైకొని భార్య దగ్గఱ కేగెను. కంట నీరు పెట్టుచుఁ దల్లిలోని కేగెను. భార్య యతని కెదురుగా వచ్చెను. ఆ సుందరసుందరీ మణుల హృదయములు నీరాయెను. ఆ చూపు లైక్యముం జెందెను.


అతఁడామె నొక్క ముద్దు పెట్టుకొని మెల్లగా ‘ సుం దరీ ! సెలవిమ్ము. పోయివచ్చెదను' అనియెను. ఆ కన్నుల నుండి బాష్పములు క్రిందికి జారుచుండెను. అతఁడు వానిని రుమారులుతోఁ దుడుచు చుండెను. ఆమె యిట్లనెను.


'చరణ కమలములనొత్తుచు నెల్లప్పుడు భర్తను బాయ కుండుట హిందూసుందరుల పరమధర్మము. కావున నన్ను గూడ మీతోడం దీసికొనిపొండు. వచ్చెదను '