పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదితో మిదవ ప్రకరణము

217


కాదు. అది స్మృతియందుంచుకొని దానింగాపాడఁ బ్రయత్నిం పుము. అట్టి యుత్కృష్ట స్వతంత్ర సామ్రాజ్యమునకు సేవచేయు భాగ్య మబ్బినందులకు గర్వింపుము.


తురుష్కులు తంత్రపరులు. యుక్తులతో జయింతురు. వారిని మాత్రము కని పెట్టియుండ వలయును. కానియెడల జిత్తు లచే వంచించి హింసింతురు.


కుమారా ! ఆర్యావర్తము ధర్మయుద్ధములకుఁ బ్రసిద్ధి కెక్కినది. నీ కెన్ని కష్టములు ప్రాప్తించినను యుద్ధధర్మములను మాత్రము తొలంగి పోకుము.


"కృష్ణ దేవరాయచక్రవర్తి గతించిన పిదప మరల నింత యుద్ధ మెన్నఁడును జఱుగ లేదు. పొమ్ము. కీర్తింగడించుము. . నీకు జయము గల్గుంగాక !”


అతఁడు సెలవు తీసికొనెను. బయలు దేటి తల్లికి మొక్కి యుద్ధ బిక్షను యాచించెను.ఆ మెయిట్లు చెప్పెను.

" నాయనా !

నీకు నేను జెప్పఁదగిన దేదియు లేదు. కాని హిందూ దేశము తురుష్కల చేత నానావస్థలం బొందుచున్నది. ధర్మ ములు నశించినవి. భూతదయ మాయమైపోయినది. పాప ములు గోహింసలు సాధునాశనము సర్వత్ర వ్యాపించుచున్నది. వీనికన్నింటికిం గారణము పాపులగు తురుష్కులే.