పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

విజయనగర సామ్రాజ్యము


కొన్నాళ్లిట్లు వారు సంతోషమున నుండిరి. అంతట 'రామరాజు చక్రవర్తి జై త్రయాత్రకు బయలు నెడలెను. మాతృ దేశాభిమానముగల యౌవనులందఱు దిక్కు దిక్కులనుండి వచ్చి సైన్యమునం గలియుచుండిరి.


జైత్ర యాత్ర సంగతి వినగనే విజయసింహుని హృద యము పరిపూర్ణానంద సమేతమాయెను. అతనిఖడ్గ మప్ర యత్నముగనే ఒఱనుండి వెలికివచ్చుచుండెను.


అతఁడు తనతండ్రియొద్ద కేగి యాయనను తనకు, యుద్ధ మునకుంబోవ ననుజ్ఞయిమ్మని ప్రార్థించెను.

అతఁడిట్లు చెప్పెను.

" నాయనా! మన తాతలనాఁటినుండి సుప్రసిదమగు విజయనగర సామ్రాజ్యమును గని పెట్టుకొనియుంటిమి. ఈ సా మ్రాజ్యమే మనతల్లి. సర్వమును దెలిసిన నీకుం జెప్పవలసిన దేది యు లేదు. కాని తాత తండ్రుల పౌరుషమును గీర్తిని నీ ఎప్పటి కిని మఱువకుము.


నేఁడు హిందూ దేశమంతయుఁ బారతంత్ర్యము ననుభ వించుచున్నది. ఢిల్లీ సామ్రాజ్యము నశించినది. దక్షిణ హిం, దూ దేశములోని యుత్తరార్థ భాగము మహమ్మదీయననాజుల వశమైనది. కాని నాబిడ్డా! నీ విపుడున్న యీపట్టణము పేర నే దివ్య సామ్రాజ్యముకలదో ఆయీ యాంధ్ర సామ్రాజ్యము- విజయనగర సామ్రాజ్యము - మాత్రము బానిస రాజ్యము