పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది తొ మిద వ ప్రకరణము


జైత్ర యాత్ర

స్వర్ణకుమారీ జగన్మోహినుల వృత్తాంత మేమయినదో మీకేమేని తెలిసినదా ! స్వార్థ త్యాగులయిన యా యాంధ్ర వీరవతంసు లిరువు రెవ్వరో తెలిసినదా ! స్వార్థ త్యాగుల జీవితములు పవిత్రములు. ప్రాతస్సంస్మరణీయములు. వారికి మనము కృతజ్ఞతంజూపుట మనవిధి.


వీరు మిక్కిలి యవశ్యమగు నొక కార్యభారమును వహించి విజయనగరమునుండి గోల్కొండకు వచ్చిరి. గోల్కొం డలోనున్నప్పుడు వారికి స్వర్ణ కుమారీ జగన్మోహినుల స్థితి తెలి సెను. వారిని తప్పించుటకై వచ్చి పాపము ప్రాణములను గోల్పోయిన మహా రాష్ట్ర సరదారులలో నొకరితో వీరికి బరి చయముండెను.


ఆహా ! ఏమి, ఆ మహారాష్ట్ర సరదారుల సాహసము ! వారు జగన్మోహినీ స్వర్ణ కుమారుల రక్షణకొఱకుఁ దమ ప్రాణ ములనుగూడ నొసంగిరి. వారట్లేల చేయవలయును? మహాత్ముల హృదయములు కేవల పరోపకారైక ప్రయోజనములు. స్వార్థ త్యాగము వారికి జన్మతోడనే జనించును. ఆ దేశాభిమాను