పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

విజయనగర సామ్రాజ్యము


చక్రవర్తితో నెదుర్కొనుటకు మదించిన యేన్గులు, కొల్బలములు, గుఱ్ఱములు కావలయును.ధైర్యశౌర్య యుక్తులయిన యోధులు కావలయును. వీనినన్నింటిని సంపాఁ దింపఁదగిన స్నేహితు లుండవలయును. , రధము లుండవల యును. ఆయుధము లుండవలయును. ఫిరంగులు మొదలగు నవన్నియు నుండవలయును. ఇన్నిటిని సంపాదించుటకు వలసి నంత ధన ముండవలయును. ఇదియంతయు నతఁడు నెఱు వేర్పఁ గలఁడా ?

ఇఁకఁ గర్తవ్య మేమి ? ఎట్లయినను రాజ్యము సంపాదింప వలయును. నేర్పుతో విషమయినను ద్రవింప వచ్చును. మెల్లఁ గా లోలోపలఁ గుట్రలుచేయ మొదలు పెట్టెను. చక్రవర్తిని మిక్కిలి ప్రేమించు చున్నట్లు నటింపఁ జొచ్చెను. మృదుమధుర ముగాఁ జక్రవర్తికి నొచ్చకుండ మాటలాడఁ దొడఁగెను. వృద్ధుఁడైన రామరాజు స్వభానముచేతఁ బరులను నమ్మునట్టి వాఁడు. అతఁడు కపటి కాఁడు. కపటుల వర్తన మతనికి దెలిసినది కాదు. తనవలెనే లోకమును భావించెను. అంత కంతకుఁ జక్రధరుఁడు తన్ను ప్రేమించుట విస్తారమైన ట్లతనికిం దోఁచుచుండెను. అందుచే నతఁడును, అంతకంతకుఁ దనకుఁ జక్రధరు నందుఁగల ప్రేమను వృద్ధి కావించెను. అతనికి రాజ్య మున గొప్పయుద్యోగములిచ్చినచోఁ బాపమతనికి రాజ్యము లేని లోపము తీరిపోవునని తలఁచెను. పెద్దయుద్యోగము