పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియారవ ప్రకరణము

199


లన్నియు నిచ్చెను. క్రమక్రమముగా నతనికి సర్వాధికారము నొసంగు చుండెను. తుదకు సర్వరాజ్య కార్యముల లోను, అతని సలహాను గైకొనుచుండెను.


ఇంతలోఁ, జక్రధరునకు మఱియొక యండ దొరికెను. అది యేదో మీ రెఱుంగనిది కాదు. ఆయండ ఆదిల్ శాహా.. ఇతఁడు విజయనగర సామ్రాజ్య పాలనమున నెట్లు భాగము వహించినది మీ రేఱుఁగుదురు. ఇట్లే యిద్దఱును సమాన కాంక్ష గలవారగుటచే మిత్రులైరి. ఏకాభిప్రాయ వంతులకు మైత్రి సుకరము. వారిద్దఱు కొన్ని నిబంధన లేర్పఱచికొని విజయనగర సామ్రాజ్యమును మ్రింగ నిశ్చయించుకొనిరి. అప్పటి నుండి యిద్దఱును గుట్రలు చేయుచు సమయము వేచియుండిరి.

విజయనగర సామ్రాజ్యమునకుఁ జాలకాలము నుండి మంత్రిత్వమును జేయుచుఁ బ్రసిద్ధింగాంచిన వంశమునందు బుద్ధి సాగరుఁడు జనించెను. అతఁడు వారితంత్రములను గ్రహించెను. అవి యతని కెంత మాత్రమును గిట్టినవి కావు. స్వాభావికమగు వైరము తటస్థమా యెను. సమయమును జూచి బుద్ధిసాగరునిం జంప వలయునని వారు నిశ్చయించు కొనిరి. కాని యతనిబుద్ధి యపారమైనదగుటచేఁ దప్పించు కొనుచు వచ్చెను. కడపటకు చెఱసాలలో వేయించుటయు, తుంగభద్రానదీ సమీపమునం జంపించుటకు యత్నించుటయుఁ గావించిరి.

"ఈ ప్రయత్నము విఫలమగుట యతని ద్వేషమును గ్రోధమును ద్విగుణము చేసెను. అతఁ డే దేశముననున్నను