పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

విజయనగర సామ్రాజ్యము


-

ఇన్నాళ్నుండి మీర్సెంప్పిందాని కెదు రెప్పుడైనా సెప్పానండి ! ఆ సంగ తేంటో సెలవియ్యండి. శేస్తాన్'

  • ప్రమాణ పూర్వకముగాఁ జేసెదవా ? ”
  • ఓ ! పెరమాణ పూర్వకంగా చేస్తానుండి ! చెప్పండి "

“ అతి రహస్యముసుమీ ! వెళ్లఁబుచ్చఁగూడదు ”

'అట్లాగే

అతఁడు తన హృదయమునందలి యుద్దేశమెల్ల నతని కెఱింగిం చెను. అతఁడంతయు సాకల్యముగా వినెను. ఆ భటుఁడు వట్టిమోటువాఁడు. కాని యతనికిం గూడ దురాశ పుట్టెను. ఆ స్త్రీ రత్నములలో నొకర్త నసహరింపవలయునని అతని కాశపొడమెను.

స్త్రీలును ధనమును ప్రపంచములో నెల్లరకు నాశ గల్గించును. ఆ రెంటివలన నే తలలు పగులును. కంఠములు తెగును. రాజ్యములు నశించును. ఋషులు, యోగులు, సం సారులు, మునులు, నాగరకులు, అనాగరకులు, అందఱు వా రిని గామింతురు. ప్రపంచములోని కక్షలకు దెబ్బలాటలకు, ఆ రెండే ప్రధాన బీజములు. అతఁడు మెల్లగా నిట్లనెను, “ అందు కడ్డాం లేదు గానండి, నానొక సంగతి మనివి నేస్కుంటా'

“ అదేమిటి ? త్వరగాఁ జెప్పు" |