పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

విజయనగర సామ్రాజ్యము


రాధా:-అవును. నేనే. ఇచటి కే వచ్చితిని.

జగన్మో: తురుష్కులకు బానిసలై యుండుట కేనాసుప్రసిద్ధాంధ్ర సామ్రాజ్యమగు విజయనగర సామ్రాజ్యమును విడిచి గోల్కొండకు వచ్చినది ?

అతఁడు నిలువున నీరై పోయెను.

రాధా:-చిన్న తనమునం జేసి తప్పొప్పులు తెలియక యుద్ధాభి లాషచే నిట్లు ప్రవేశించితిని. కాని తరువాతఁ బశ్చాత్తాప పడుచునే యుంటిని. ఇంటి గుట్టు లంకకుఁ జేటన్న మన వారు తురుష్కులపశుమునఁ జేరి యిట్లు కుట్రలు పన్ను చుంటచేతనే మన హిందూ సామ్రాజ్యము లన్నియు నశించు చున్నవి. కాని సోదరీ ! ఇందు 'నేనొక విశేషమును జెప్ప సాహసించుచున్నాను. మన్నింపుము. నాయీ తురుష్క సేవ యొక విధముగా మంచిగ నే పరిణమించినది. నేనిచట లేకున్న మీ యీదుఃఖ కాలమున నేను మీతోఁగూడ సమముగా దుఃఖమును బంచుకొని యనుభవించు భాగ్యము నాకుఁగల్గునా ! మీదుఃఖమును నాదుఃఖముగాఁ దలఁచి దానిని దప్పించుటకు దగినశక్తిని నా కొసంగుటకు దైవ మును బ్రార్ధింతును.

జగన్మో:-సోదరా ! విపశ్చాత్తాపముతోడి హృదయము నే నెఱుంగనిది కాదు. అయినను జూడవలయునని యిట్లంటిని. క్షమింపుడు. మాకష్టముల కొఱకు మీరుకూడఁ గష్టములం .