పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ ప్రకరణము

115


బుద్ధిః' అని దానినే పెద్దలందురు. కాని యింతమాత్రముననే అట్లు సంభవించితీరునా ! ఏది యెట్లయినను అట్టినిర్దోషులను మనము పూజింపక మానుదుమా! వారివంటి పూజ్యులు మఱి కలరా ! అట్టివారి పాదరజో లేశములచే నిండిన యాకారగార ములు విగత పాపములై పుణ్యక్షేత్రములుగాఁ బరిణమించును. అతఁడు నేఁడుదయము నిర్మలములై మనోహరమై సుగంధ యుక్తములై సమీపస్థ కుసుమిత లతా పరిమళ సమేతములై యచటికిఁ జేరువగా నున్న యొక సరసీ రమునుండి వచ్చుచున్న కమ్మ తెమ్మరలను సేవించుచు నాభవనపుముందు భాగమున షికార్లు చేయుచుండెను. అతఁ డిట్లు యోజంపసాగెను. ఇది కేవలము నన్ను జంపవలయుననియు, అది ప్రత్య క్షముగాఁ జేసిన లోకమునకుఁ గోపము వచ్చుననియుఁ బన్నిన పన్నుగడ. ఇంతకంటె మఱేమియ: గాదు. నేనిందుండిన దప్పిం చుకొని విఘ్నములు కలిగింపక యుండనని వారెఱుఁగుదురు. మఱియు నిట్లు చేసిన చో,అమాయకులగులోకులు, వారియాంత రంగిక దూరదృష్టిని దుస్వభావమును గ్రహింప నేరక తమ్ము మిక్కిలి దయాస్వభావముకలవారని స్తుతింతురనియు వారి యాశయము. .ఇదియెల్ల ధీర్ఘ దృష్టి యొక్క పర్యవసానమే. అగుఁగాక'! దీనికిఁదఁగిన బ్రతిక్రియ నెఱు వేర్పఁజాలనా ? ”

అతనికి దూరమున నొక బిక్షకుఁడు కన్పట్టెను. ఆ బిక్ష కుఁడు శాంతుఁడు. అతనిరూప ముజ్వలమై 'యుండెను. అతఁ