Jump to content

పుట:VignanaSarvasvamuVol4.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 దర్శన స్వరూప స్వభావములు మానవుల, వస్తువుల స్వరూప, స్వభావములను 13.చి, వాటి ప్రవృత్తి, కర్మ , కార్యములను గురించి, వీటన్నిటి మధ్య గల సంబంధములను గురించి చాల సంగతులు ప్రత్యక్షముగను, దానిపై ఆధారపడిన అనుమానము ల (inferences) ద్వారాను తెలిసి కొనవచ్చును. ఈ అనుమానములను రుజువు చేసికొన వచ్చును. కాని వీటిని గురించి వేయుటకు వీలైన అనేక ప్రశ్నలకు, కలుగు సందేహములకు ప్రత్యక్షము పైన గాని, అనుమానము పైన గాని ఆధారపడినచో సమాధానములు దొరుకవు. అప్పుడు క్రమబద్ధముగా , ఊహా చోడితుడై భావనా శక్తి సహాయముతో మానవుడు చింతన చేయవచ్చును. అప్పుడు అసలు తెలిసికొను! అకగా ఏమి? జ్ఞాన స్వరూపము ఎట్టిది? దేనిపై అది ఆధారపడి ఉన్న డి? ఎట్లు కలుగుచున్నది? జ్ఞానమును జ్ఞాన మని పరీక్షించి తేల్చుకొనుట ఎట్లు?" ఇటువంటి సమస్యలు ఏర్పడును. అట్లే లక్ష్యములను, పిలువలను గురించి, కార్యాచరణ రీతులను గురించి, కర్తవ్యమును గురించి సమస్యలు తోచవచ్చును. లక్ష్యములు, విలువలు, మంచి, చెడుగు, కర్తవ్యము, అకర్తవ్యము, శాశ్వతము, అశాశ్వతము, వస్తువు, అవస్తువు, సత్యము, అసత్యము, యథార్థము, అయథార్థము - మొదలైన ఇంచుచు చేయబడిన ప్రతిపాదనలను, వాక్యములను గురించి మీమాంస జరుగవచ్చును. “ఈ మాటలు ఎట్లు వాడుకలోనికి వచ్చినవి. ఇవి భావములపై ఆధార పడియున్నవి; ఆ భావములకు ఏవైన ఆశ్రయములు ఉన్నవా? అని స్వతంత్రముగా, సహజముగా మానవ మస్తిష్కములో పుట్టినవా?” అనెడు ఆలోచన కలుగ వచ్చును. ఇట్లు భావములకు, అర్థమునకు, భాషకు గల పరస్పర సంబంధము, ఆలోచనకు, వ్యాపారము నకు, లక్ష్యములకు, ఆవర్శములకు, కృషికి గల పరస్పర సంబంధము సరళముగాను, సమస్యా రహితముగాను, పెద్దగా చింతన చేయ నక్కర లేని విషయములుగాను కన్పడవచ్చును. కాని వీటిని గురించి మననము చేసినచో వీటిలో ఎన్ని యో చిక్కులు, సమస్యలు, లోతులు గోచరించును. ఈ పై పేరాలలో సూచింపబడిన సమస్యల పరిష్కారమునకై జరుగు ఆలోచన విజ్ఞాన, మత, కవిత్వాదులలోని మానసిక వ్యాపారమునకు భిన్నము. ఇట్టిదే 'దార్శనిక' చింతనకు దారి తీయును. “దర్శన ' నిర్వచనము : ఏదో యొక సంస్కృ తికి చెందిన ఏదో యొక సంఘములో ఒకడైన మానవుడు పూర్వగులు, చుట్టునున్న వారు అనుసరించు విధానములనే అనుసరించుచు, వారివలెనే వారు సాధింప యత్నించుచున్న ప్రయోజనముల కొరకే పాటుపడుచు లోకవ్యవహారమును విమర్శింపకుండ , పరీక్షింపకుండ సాగించుట మానవులకు సాధారణ ముగ సహజము. ఏదో ఒక క్రొత్త భావము (ఉదా. అవధులు లేని విశ్వము ఒకటున్నది. అందు అనేక సాధ్యములకు, సాధనలకు తావున్నదను భావము), లేదా అనుదినము చేసినదే చేయుచు ఆవృత్త మరు చున్న జీవితము, అందులో అనివార్యముగ కల్గుచున్న జన్మ మృత్యు జరా వ్యాధులను, దుఃఖ దోషములను చూచుట, లేదా మనము సాధించుచున్నట్టి, చేయు చున్నట్టి వస్తువులు, కార్యములు నిరర్థకములు, నిష్ప్రయోజకములు అని అనుభూతమై, స్వయంసిద్ధ ముగా సంపూర్ణముగా సార్థకమైన, శివమైన వస్తువు ఉన్నదా దా అను అన్వేషణ, లేదా వస్తువులకు నిజమైన ఆధారము, కారణము, గమ్యము ఏది? అను జిజ్ఞాస, లేదా విశ్వమును గురించియో, అందులో ఏదో ఒక వస్తువును, వ్యక్తిని, లేదా సంఘటననో గురించిన ఆశ్చర్యము, లేదా మంచి జీవిత విధానమును అనుస రింపవలె నను ఆరాటము వలన మానవుడు తనను గూర్చియో, తన బాధ్యతలను , కర్తవ్యములను గూర్చియో ఆలోచించుట - వీటిలో ఏ ఒకటియైన కేవలము ప్రత్యక్షముపైన, అనుమానముల పైన ఆధారపడని చింతనకు దారితీయవచ్చును. అది ఫలించి క్రమబద్ధమై సుసంగతమైన భావములలో పర్యవసించి నప్పుడు 'దర్శనము' అనబడును. కొన్ని సన్ని వేశ ములు, అనుభూతులు(ఉదా. అద్భుత,1 ఉగ్ర, దివ్య, 3 లేదా పవిత్ర 4 వస్తు సంబద్ధములు), ఉద్వేగములు 1. numinous, 2. tremendous, 8. divine, 4. sacred. మాటలను ఉపయో