పుట:VignanaChandhrikaMandali.djvu/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లయ్యెనని తెలుపగలుగుటకు సంతసించుచున్నాము. ఈ సంఘములేగాక పలువురు గ్రంథకర్తలు గూడ గ్రంథములు వ్రాసితమంతట తాము ప్రకటించుచున్నారు. మాతృభాషను శృంగారింపగడంగి మాతో పనిజేయు నీ భాషాభిమానుల కందరకును మేము మనఃపూర్వకముగ స్వాగతమొసంగుచున్నాము.


ఈ సందర్భమున మాలో కొందరు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వమును ఇప్రకటింప బూనిరని తెలుపుటకు సంతసించు చున్నాము. కార్య భారము మిక్కుటము; అనుకూలమో కొద్ది. అయినను అభిలాషమెండు. కాబట్టి విద్యాభిమాను లందరును ఈ యుద్యమమునకు తోడ్పడి జయప్రదము గావింతురుగాక!.

ఆంధ్ర వాచక ప్రపంచమును, ఆంధ్రరాజ చంద్రులును, విజ్ఞాన చంద్రికామండలికి తమ పోషకత్వమును ప్రాదించెదరుగాక. విజ్ఞాన చంద్రికా మండలి నానాటికి వృద్ధి చెంది యనేక గ్రంధ కుసుమములతో ఆచంద్రార్కము నాంధ్ర భాషామ తల్లిని పూజించుచు దేశ సేవ జేయును గాక! !

చెన్నపట్టణము: 12.4.14

బ. నరసింహేశ్వరశర్మ.
ఆ. లక్ష్మీపతి.
కే. వి. లక్ష్మణరావు.
వే. విశ్వనాథశర్మ
గూ. రామచంద్రరావు.
తా. వేంకట్రామయ్య.