యందు (1912-1913) స్త్రీలే హెచ్చు బహుమానములను పతకములను సంపాదించియుండుటయే, విద్యాభిరుచి వారికీ పరీక్షలచే హెచ్చినదనుటకు నిదర్శనము. ఈ పరీక్షలను జరుపుటయందు మాకు మిక్కిలి సహకారులైన పరీక్షకులకు మేము మిక్కిలి కృతజ్ఞఉలము. వారినామములను ఏడవ అనుబంధములో నిచ్చియున్నాము. వారి సహాయము లేనిది మేమి పని నెంతమాత్రము నిర్వహించియుండమని చెప్పకతప్పదు. పరిషత్పరీక్షా పత్రముల 14-వ అనుబంధములో నిచ్చియున్నాము.
బహుమతి నవల
దేశభాషల నభ్యసించుట యందును, దేశభాషల యందు గ్రంథములను రచించుటయందును, ఈమధ్య నొకవిధమయిన యుత్సాహము పుట్టియున్నది. ఇట్టి యుత్సాహమును పెంపొందించుటకై ఆంధ్రదేశమునకు సంబంధించిన యేదైన నొక కథను గైకొని నవలను వ్రాయువారలలో నుత్తమునికి మేము రు. 500 లు బహుమాన మిచ్చెదమని 1912 సంవత్సరములో ప్రకటించియున్నాము. ఆ ప్రకటనానుసారముగ 10 నవలలు మా కార్యస్థానమునకు చేరినవి. అందొకటి గడువుదాటిన తరువాత వచ్చినందున నిరాకరించితిమి. మిగతా 9 నవలల పరీక్షించుటకై నొక కమిటీని నేర్పరిచితిమి. ఆ కమిటీవా రేకాభిప్రాయముగ కృష్ణాజిల్లా అంగలూరి కాపురస్తుడు మ-రా-రా-శ్రీ, దుగ్గిరాల రాఘచంద్రయ్యగారు రచించిన విజయనగర సామ్రాజ్యము అను నవలకు అగ్రస్థానమొసంగిరి.