కును, ఈ బుక్కుడిపో మిగుల యుపకరించినదని వ్రాయుటకు సంతసించుచున్నాము.
పరిషత్తు
మండలి మూలమునను ఇతర విధములను దినదినాభివృద్ధి యగుచున్న ఆంధ్రవాజ్మయ పఠనమును వృద్ధిచేయు నుద్దేశముతో 1910-వ సంవత్సర మధ్యమున రావుబహుదూరు కం. వీరేశలింగం పంతులుగారు అధ్యక్షులుగా నొక పరీక్షా సంఘమును విజ్ఞాన చంద్రికా పరిషత్తను పేరుతో నేర్పరిచి యున్నాము. దాని కార్యనిర్వాహకుల యొక్కయు పద్ధతుల యొక్కయు వివరములను మూడవ అనుబంధమున చూడనగును. 1911 సంవత్సరము జూన్ నెల కడపటి వారమునందు తెలుగు దేశమునందలి 20 ముఖ్యపట్టణములలో సాహిత్యము, చరిత్ర, శాస్త్రము, అను మూడు విషయములలో నీపరీక్ష జరుగునని ప్రచురపరచితిమి. తదాదిగ నేటేట అట్టి పరీక్షలను జరుపుచున్నాము. నేటివరకు 406 గురు విద్యార్థులను పరీక్షించి అందు కృతార్ధులైన 112 గురికి యోగ్యతాపత్రముల నిచ్చియున్నాము. కృతార్ధులైనవారి పేర్లను యోగ్యతాపత్రముయొక్క నొక చిన్నప్రతిమను 4-5 అనుబంధములలో నిచ్చియున్నాము. మొదటి సంవత్సరము 430 రూపాయలతో ప్రారంభించి కడపడి సంవత్సరం 516-0-0 లు వెలగల బంగారు పతకములను రొఖపు బహుమానములను ప్రతిసంవత్సరము ఇచ్చియున్నాము. బహుమానము పొందినవార్ల పేర్లను బహుమానము లిచ్చినవార్ల పేర్లను 6వ అనుబంధములో చేర్చియున్నాము. వరుసగ రెండు సంవత్సరముల