Jump to content

పుట:VignanaChandhrikaMandali.djvu/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రొక్కి చూపించినను జీవశాస్త్రము రసాయనశాస్త్రము ఆర్ధికశాస్త్రము మొదలగు ఉత్కృష్టశాస్త్ర గ్రంథములను భాషాంతకరించుట యెన్నటికైన సాధ్యమగునా యని మన దేశీయులు సంశయించు దినములలో పుట్టి శాస్త్రజ్ఞానము జనసామాన్యమునకు వ్యాపింపజేయవలె నన్న దేశభాషల మూలముననే జేయవలె నని దృష్టాంత పూర్వకముగా నేటికీ రుజువు పరచగలిగితిమని సంతసించుచున్నాము.

మండలి ప్రథమ సంవత్సర కార్యవిధానము నంతయు కీర్తిశేషులైన రావిచెట్టు రంగారావు మనసబుదారుగారు హైదరాబాదు మూలస్థానముగా నేర్పరచుకొని దృఢానురాగ దీక్షతో నిర్వహించిరి. మండలియొక్క సంకల్పములతో ఏకీభావము వహించి దానిని జయప్రదముగా జేయుటకు వారుజూపిన అమూల్యభక్తికిని అపార పరిశ్రమకును మేమెంతయు కృతజ్ఞఉలము.

మండలివారు నాలుగు పుస్తకములు ప్రచురించు సరికి కార్యస్థానము హైదరాబాదులో బెట్టుకొని తమ కార్యములను చక్కగ జరగించుట యసాధ్యమయ్యెను. అందుచే 1908 సంవత్సర మధ్యమున కార్యస్థానము చెన్నపట్టణమునకు మార్చబడెను. అప్పటినుండియు పుస్తకముల నిక్కడినుండియే ప్రకటించుచున్నాము. మండలియు దినదినాభి వృద్ధిగాంచుచుండుటచే దానిచరిత్ర నిప్పుడు వ్రాయుటకు వేడుకగానున్నది.

పుస్తక ప్రకటన.

మండలి పక్షమున నింతవరకు 23 గ్రంథములు వెలువడినవి. 1-వ అనుబంధము చూడనగును. అందు 12 శాస్త్ర