పుట:VignanaChandhrikaMandali.djvu/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞాన చంద్రికా మండలి

ప్రారంభదశ

1906 సంవత్సర మధ్యమందు 5 గురు ఆంధ్ర యౌవనులు గుంటూరు పట్టణమున సమావేశమై దేశభాషలగుండ మాతృదేశపు జనసామాన్యమునకు పాశ్చాత్య పరిజ్ఞానమును వ్యాపింపజేయుటకు సంకల్పించి ఒక మండలిగా నేర్పడిరి. ఈ సంకల్పమును నిర్వహించుటకు 100 పుటలుగల మాస పత్రికను ప్రకటించుట మంచిదా, ఉపయోగకరములగు అనేక విషయముల గూర్చి సులభమగు వేర్వేరు కరపత్రములను విరివిగ పంచిపెట్టుట మంచిదా, శాస్త్ర సంబంధమయినట్టియు చరిత్రాత్మకమయినట్టియు విషయములను గూర్చి వివరించు పటుతరము లగు గ్రంథములను నొక్కటొక్కటిగా ప్రకటించుట మంచిదా, అను విషయములను తర్కించి వీనిలో కడపటిపద్ధతి యనుకూలముగ నున్నదనియెంచి తక్షణమే పనికి ప్రారంభించిరి.

ఈ యుద్దేశ్యములను ఆశయములను సూచించుచు నొక చిన్న వ్యాసమును మేము మున్ముందుగా ప్రకటించిన అబ్రహాము లింకను చరిత్రయను గ్రంథము యొక్క పీఠికయందు ప్రచురించితిమి. ఇంత కాలము గడచిన పిమ్మట ఆ పీఠిక నిప్పుడు మన మొక్కసారి చూచినయెడల మండలి నిర్మాతలు, దాని భావ్యభ్యుదయము నంతగా నెరింగియుండలేదని బోధపడగలదు. రావుబహదూరు వీరేశలింగం పంతులుగారు దారి