పరిషత్సభ 1913-వ సంవత్సరములో తిరిగిమార్చబడినది. ఇప్పుడీప్రకారముగా సభాసదులుగలరు.
అధ్యక్షుడు.
మ.రా.రా. రావుబహదూరు కం. వీరేశలింగము పంతులుగారు, రాజమండ్రి.
ఉపాధ్యక్షుడు.
" చెన్నాప్రగడ భానుమూర్తిగారు, బి.ఏ., ఎల్.టి. చెన్నపట్టణము.
సభాసదులు.
మ.రా.రా. క. రామలింగారెడ్డిగారు, ఎం.ఏ., మైసూరు.
" కే. వి. లక్ష్మణరావుగారు, ఎం.ఏ., మునగాల.
" ఆ. లక్ష్మీపతిగారు, బి.ఏ., ఎం.బి.సి.ఎం., చెన్నపట్టణము.
" అ. కాళేశ్వరరావుగారు, బి.ఏ., బి.ఎల్. బెజవాడ.
" జి. వేంకటరంగారావుగారు, ఎం.ఏ.
" చి. వీరభద్రరావుగారు, రాజమండ్రి.
" వి. వి. శర్మగారు, ఎం.ఏ., ఎల్.టి. కార్యదర్శి.
I. సంకల్పము.
ఇంగ్లీషు తెలియని ఆంధ్రజనులకు సాహిత్యమునందును దేశచరిత్రములందును ప్రకృతి శాస్త్రములందును, జ్ఞానాభివృద్ధిచేయుట ఈ పరిషత్తుయొక్క ముఖ్యోద్దేశము.
II. పరీక్షలు.
ఇందుకొఱకు ప్రతిసంవత్సరము ఈదిగువ నుదహరించిన ప్రకారము పరీక్షలు జరుపబడును. అట్టిపరీక్షలో తేరినవారలకు విలువగల బహుమతులిచ్చి గౌరవింతుము.
III. ప