పుట:Venoba-Bhudanavudyamamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8


లివ్వదలంచిన, తెలుప ప్రార్థించుచున్నాను."

ఇంత వుత్తమమైన విధేయతగల శిష్యుడే గురువునకు లభ్యపడి వుండడు. మహాత్మాజీ తమ హృదయమును విప్పి, తిరిగి జవాబువ్రాసిరి. “నీప్రేమ, విశ్వాసములకు పరమానంద భరితుడనగుచున్నాను. వానికి నేనర్హుడ నవునో, కాదో, కాని అవి నీకు తప్పక అపారమైన మేలుచేకూర్చ గలవు. నీవు మహత్తర కార్యసాధనకై జన్మించినవ్యక్తివి."

అపూర్వ గురు శిష్యులు!

1937 సం||లో నల్వాడ నుండి వినోబాజీ పౌనారు చేరిరి. 1940 సం||లో ప్రప్రధమముగా హిందూదేశ మొదటివ్వక్తి సత్యాగ్రహిగా వినోబాజీ పేరు ప్రఖ్యాతిచెందెను. ఈమహత్తర కార్యసాధన కై వినోబాజీని మహాత్మాజీ ఎన్నుకొనిరి. మూడు మాసముల జైలు శిక్ష విధింపబడెను. పండిట్ జవహరలాల్ రెండవ సత్యాగ్రహిగా ఎన్నుకొనబడెను. విడుదలా నంతరము వినోబాజీ తిరిగి సత్యాగ్రహము చేయుటచే, తిరిగి అఱుమాసములు కారాగార శిక్ష అనుభవించిరి. మూడవసారి ఒక సంవత్సరం జైలు జీవితమును గడిపిరి. చారిత్రాత్మకమైన ఆగష్టు 1942, వుద్యమ సందర్భములో, వినోబాజీ 1942 ఆగష్టు 9 తేదీన ఖైదుచేయబడి, 1945 సం!! జూలై 9 తేదీన విడుదలైరి. ఈసమయములో కొంత కాలము మద్రాసు రాష్ట్రములోని వెల్లూరుజైలులో గడిపిరి. అచ్చటనే, తమతోటి ఖైదీలవద్ద ఆంధ్ర కర్ణాటక , తమిళ, కేరళ, భాషనభ్యసించిరి. అచ్చట నుండి మధ్య ప్రదేశములోనున్న “సీయోని" జైలునకు పంపబడిరి. వార్ధాకు తిరిగి వచ్చునప్పుడు తమకుగల్గిన ఆనుభవ" ఫలితముగా ఆశ్రమం చేరగనే పౌనారుకు 4 మైళ్ల దూరములోనున్న "సర్గాన్" అను గ్రామములో పాకీపని ప్రారంభించిరి. కుంభ వర్షములోనైనను, అపరిమితవేడి, చలిలోనైనను నాల్గు మైళ్లునడచి, వెళ్లి, తమకార్యాన్ని క్రమవిధానముతో నెరవేర్చడి వారు. బాపూజీ మరణము వరకు వినోబాజీ యీపనిలోనే నిమగ్నులై వుండెడివారు. బాపూజీ మరణానంతరము దేశపరిస్థితులు వారి అత్యధిక బాధ్యతను గుర్తింపజేయుటచే తామప్పటి వరకు చేయుచున్న కార్యమును విడువవలసి వచ్చెను. 1948 సం|| నుండి దేశపరిస్థితులను, ముఖ్యముగా కాందిశీకుల సమస్యను అవగాహన మొనర్చు కొనుటకు రైలులో దేశాటన ప్రారంభించిరి. దీనిని వారు "శాంతియాత్ర" అని ఆనెడివారు. కాని