పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 5's ல்ா పొడుపుగుబ్బలిమీఁదఁ బొడుచు భానునిలీల గలకిరీటము తలఁ గలుగువాని అరచందురుని వెన్నుసఱఁచునెన్నుదుటిపై ముత్యాలతిరుమణి మరువువాని మొసలివామించుల మిసమిసల్దీపించు నొ సపరి కుండల యుగము వాని సెలవులతుదకెక్కు చిరునవ్వుడాల్డెక్కు తళుకులేజెక్కుల కులుకువాని గీ|| కలువతామరకొలముల వలనఁ జేయు చూపులను చలి వేడియుఁ జూపు వాని విమల లావణ్యజలనిధి వేలఁబౌడము పగడమన నొప్ప వాతెఱ సౌగసువాని. సీ|| కరశంఖమునకు నేక గ్రీవమను తేవ గల గ్రీవచెలువులఁ జెలఁగువాని తనువెత్త కీ_ప్రతాపంబు లన మించ కరగతశంఖచక్రములవాని నాకల్పఫలమిచ్చు నాకల్పశాఖల దాయాదులౌ కేలుదోయివాని నలకనిర్జితభృంగయా" నలమేల్మంగ కిరవైన పచ్చని యురమువాని గీ|| కోరి యిరుదుగ మొగముల కుజ్జగన్న యమ్మదానగు పొక్కిటితమ్మివాని ఘోరదానవవిపినకుఠారమైన బలుకఠారంబు కటితటి. గలుగు వాని. 5