పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ వేంకటేశ్వరస్తుతిరత్నమాల



ఇంపునఁ బృథుకంబు లిడిన కుచేలు
సంపన్నుఁ జేసిన చతుర ! మేల్కనుము
దారుణభూ భారతరణావతార
భూరివ్రతాపవిస్ఫురణ మేల్కనుము
సదమలానంద ! నిశ్చయముల కంద !
విదురుని వింద ! గోవింద ! మేల్కనుము
బోజక న్యాముఖాంభోజ ద్విరేఫ
రాజీవనయనాభిరావు ! మేల్కనుము
వరరూపవతి జాంబవతితోడి రతుల
నిరతిమై నోలాడు నిపుణ ! మేల్కనుము
మంజుల సత్యభామా మనస్సంగ
రంజితగాత్ర సంరంభ మేల్కనుము
లలిత కాళిందీవిలాసకల్లోల
కలిత కేళీలోల ఘనుఁడ మేల్కనుము
చారుసు దంతా విశాలాక్షి కుముద
సారప్రభాపూర్ణచంద్ర ! మేల్కనుము
నేత్రరాగవి శేష నిచిత ప్రతోష
మిత్రవిందారనోన్మేష ! మేల్కనుము
భద్రానఖాంకుర బాలచంద్రాంక
ముద్రిత భుజతటీమూల ! మేల్క_నుము
లక్షణాపరిరంభ లక్షి తోదార
వక్షోవిశాలకవాట ! మేల్కనుము
వేడుక బదియాఱు వేల కామినులఁ
గూడి పాయని పెండ్లికొడుక 1 మేల్కనుము