పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల

కలిత నక్రగ్రాహగంభీరజలధి
వలయిత ద్వారకావాస ! మేల్కనుము
జలదనీల శ్యామ ! జగదభిరామ
Tవెలయ మేల్కను మంచు విన్నవించుటయు
వీనులఁ గదిసిన వెలిదమ్మికన్నుఁ
గోనల నమృతంబు గురియ మేల్కా_ంచి
సరసిజాముఁడు దేవసంఘంబు మీఁద
కరుణాకటాక్షవీక్షణము నిగుడ్చి
శ్రీవేంకటాచల శిఖర మధ్యమున
సౌవర్ణమణిమయ సౌధంబు లోన
పూగ చంపక కుంద పున్నాగ వకుళ
నాగరంగప్రసూన విరాజమాన
తరులతా పరివేష్టితం బైన యట్టి
నిరుపమ కోనేరి నిర్మలాంబువులఁ
దిరుమజ్జనంబాడి ది వ్యాంబరంబు
ధరియించి దివ్యగంధము మేన నలఁ ది
నవరత్నమయ భూషణంబులు దాల్చి
వివిధ సౌరభముల విరు లోలి ముడిచి
ధారుణీ సురులకు దానంబు లొసఁగి
చేరి యక్షతములు శిరమునఁ దాల్చి
వినుతులు గావింప విబుధ సన్మునుల
మనవులు విని వారి మన్నించి మించి
యగణితరత్నసింహాసనారూఢుఁ
డగుచు మేరువు మీఁది యుధ్రంబు వోలెఁ
గరకంకణోజ్జ్వలక్వణనంబు లెసఁగ