పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30


విలియంవహబ్ గారికి పరమమిత్రులు. అందుచేత వారి మేనల్లునిపై మాల్వీకి అవ్యాజ ప్రేమక లిగెను. వారు వృద్ధులు. రెడ్డిగారు 17 - 18 సంవత్సరముల యువకులు. ఆ పెద్ద మనిషి రెడ్డి గారిని దినమును వద్దకుకు పిలిపించుకొని వారికొక విధముగా స్వయం గురువులగుచు వచ్చిరి. తాను కచ్చేరీ వ్యవహారములు సాగించునప్పుడు ఈ అమీను గారిని తన వద్దనే కూర్చున బెట్టుకొనుచు ఆనుభవము కలిగించు చుండిరి. మరియు మొహరిర్ సంతకమునకై తెచ్చిన కాగితములలో సాధారణ మైనవి పోగా ముఖ్యమైన మిసళ్లను తమవద్దనే ఉంచుకొని అమీను గారికి చదివి విషయను బోధించి వాటి పై ఏవిధముగా వ్రాయవ లెనో చెప్పి వాయించు చుండెడివారు. అంతేకాక ఉర్దూ ఫార్సీలో ఇంకను ప్రవీణత కలుగుటకై పాఠములు బోధించు వారు. ఉర్దూలో మంచి మంచి కవుల కవితల చదివించు వారు తుదకు వీరిచేతను కవిత్వము వ్రాయించినారు. వేంకట రామారెడ్డి గారుకూడ ఒక కాలములో కవులైయుండిరన్న మాట యెవ్వరును ఎరుగరు. వారికవిత లేమైన లభ్యమైన అవియెట్లుండునో యేమో! తమకవితాభివృద్ధికై ఉర్దూ వాజ్మయములోని ప్రసిద్ధకవుల గ్రంథాల ననేకముగా రెడ్డిగారు తెప్పించుకొనిరి. ఆ గ్రంథాలు ఈ 50 ఏండ్ల అనంతరము ఇప్పటికిని వారివద్ద నున్నవి. వీరిని ప్రోత్సహించటకై ఆవృద్ధు వీరికవితలను విని