పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210


హస్త వస్త్ర పరిశ్రమను గురించి మన దేశమునకు ఉత్తమ మార్గదర్శకులయొక్కయు, మంచి విద్య యొక్కయు, ఉత్కృష్ట కౌశలము యొక్కయు, మరియు ఆతిముఖ్యమైన కట్టుదిట్ట ములుగల విక్రయస్థానముల అవసరమున్నది


వ్యక్తి ప్రయత్నమును, సమిష్టి కృషియు సహకార సంఘమునకు తోడ్పడునటుల ప్రభుత్వ పోషకత్వమువలనను నా యా పర్యవసానములు గోచరము కాగలవు. వారి పశీ కరణము వస్త్ర పరిశ్రమ యొక్క భావిజమును ధృఢపరచును

. హస్త వస్త్ర పరిశ్రమాభివృద్ధి కై గత వత్సరములందు ప్రభుత్వ మొనరించిన సహాయ మెంతయు ప్రశంసనీ యాంశము. వస్త్ర నిపుణులు మరియు రంగు వేయుట యందు కుశ లుల యొక్క సహాయమున, వస్త్ర పరిశ్రమకు సంబంధించిన విద్యను వ్యాపింపజేయుటకై అతి వ్యయముతో చేసిన యేర్చాటులు, ప్రచురము జేయు ప్రదర్శకుల నియామకము, ఉత్తమ విధమగు పరికరముల ఆచారమునకై చేయుచున్న ప్రబోధము ప్రభుత్వముయొక్క పారిశ్రామిక సంస్థ యొక్క అమూల్యసేవలు. మరియు పద్మశాలీయుల కుదారముగ నప్పులనిచ్చుట, సహకార సంఘముల సహాయమున పద్మశాలీల స్థితిని బాగుపరచు ప్రయత్నములు ప్రభుత్వము యొక్క యుద్దేశము, ఔదార్యమును వ్యక్త పరచుచున్నవి. పద్మశాలీయుల స్థితిని తొలగించుటకై వాని యవసరము ముఖ్యము.