పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

209

 మన పరిశ్రమల వలన నిస్సంశయముగ ప్రతి దేశ మున గౌరవము కలుగగలదు. అనుభవిద్దమగు నొక దృష్టాం తరమును బట్టి అది తెల్లము కాగలదు. పట్టుబట్టలకై పరాకు నొందిన ఫ్రాన్సు దేశమున నామిత్రుడొకడు సంగారెడ్డి యందు నేయబడిన సామాన్యమైన పట్టుబట్టను పట్టును పరికించుట యందు ప్రత్యే నైఫుణ్యముగల ప్రాన్సుయువిదలకు చూపిం చెను. ఆయువిదలు యావసనమసు చూచిపొగడిరి- దానిస్వల్ప వెల పై ఆశ్చర్యపడి. ప్యారిసునండట్టి బట్ట దొరకిన, బాగుం డెడిదనికోరిరి, అందమగు ప్యారిసు పట్టుకంటే పల్లెలయందు తయారై మోటుగ నగుపడుచుండెడి వస్త్రము నెందులకై మెచ్చుకొనరని వారి స్నేహితుడు విచారించ వారలు భారత దేశ హస్త జనిత పర్పటాంబరము యొక్క మోటు దనము నందేసహజ సౌందర్యమున్నదో పరాసునందలి యంత్రనిర్మిత వస్త్రము నందు కనబడవని వారు జవాబిచ్చిరి. ఈమెప్పుదల అసహజమనియో, పాశ్చాత్య వైపరీత్య మనియో మీరు తలంపుడు. కాని దాని వలన మన చేతి పట్టు ఐరోపా ఖండము నందును వ్యయమగునని తేటపడినది. పరాసు దేశ చక్రవర్తి యగు లూయి మహాశయుడు నాందేడు వస్తువుల నుపయోగిం చుచుండె నను విషయము నూతనమైన వార్త కాదు. అది అనాదీయ మైనది.