పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200


క్కరే వారి యొద్దకు వెళ్ళి. మాట్లాడవలసిన సంగతులు మాట లాడి పోతూవచ్చిరి. రహస్య విషయములు మాటలాడవలసిన వారుంటే అట్టివారిని లోపలికి తీసుకొనిపోయి యేకాంతంగా మాటలాడి పంపి వేసిరి. ఎంతమంది వచ్చినాసరే నిదానంగా, నెమ్మదిగా మాట్లాడి పంపి వేయుదురు గాని విసుగు జెందరు. తొందరపడరు. కోప్పడరు. చెప్పిన సంగతులే తిరిగి తిరిగి చెప్ప టం, కాలహరణం చేయటము మన వారి స్వభావమైన చెప్పే మాటలను ఓపికతో విందురు గాని కాలహరణ మయినది వెళ్ళిరండి అనే మాట వినబడదు. అధికంగా యెక్కువ సేపు మాటలాడ దలచిన వారుంటే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతములో ప్రత్యేక దర్శన మిచ్చి మాట్లాడుతూ వుంటారు మోటర్ల మీద, గుర్రపుబండ్ల మీద తిరుణాలకు వచ్చినట్లు వచ్చే ప్రజ యావత్తు ఒక తరగతి వారు ఒక పనికై వచ్చిన వారు గారు. 'పెద్ద ఉద్యోగులు, లక్షాధికారులు మొదలు ఉద్యోగాలకు, శిఫార సులకు, రాజ్యవ్యవహార సంబంధమైన స.ప్రతింపులకు స్కూలు జీతాలకు, విరాళాలకు అది ఇది అని విడదీయటం ఎందుకు! అన్ని విధాల సహాయ్యానికి వచ్చే వారుగా ఉంటారు.


వేంకట రామారెడ్డి గారికి ఆంగ్లవిద్యా పరిచయం స్వల్పం సవనాగరిక సంప్రదాయం అభ్యాసం రాలేదు. పాశ్చాత్య దేశాలకుపోయి ఆధునిక పోలీసు పద్ధతులను పరిశీ