పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

199


డేయెర్రటి ఫెజ్ టోపి, తెల్లటి వదలులాగు, నీలపురంగు గుడ్డ మీద తెల్ల చారలు కఫ్సవున్న పొడుగైనషర్టు. వీరే హైద రాబాదు కొత్వాలుగా నుండిన రాజాబహద్దరు వేంకట రామా రెడ్డి ఓ. బి. ఇ. గారు. వీరి విగ్రహంలో ఆకర్షణీయమైన అంశమేమీ లేదుగాని వారి సులోచనాల అడుగున దాక్కొని యున్న ప్రకాశమైన నేత్రములు, దయాసంకలిత హృదయాన్ని సూచించే ఆ నిష్కల్మషపు ముఖవికాసం ధృఢ సంకల్పాన్ని ప్రకటించే ఆ చెక్కిళ్ళు చూపకులకు ప్రస్ఫుటముగా కనిపిస్తవి. వీరు పోలీసు ఉద్యోగీయు లైనప్పటికి భయంకర ఆకృతియేమి లేక కొంత ప్రేమ, దయాళుత్వమే అధికంగా వీరియందున్నవి. బల్ల దగ్గర వీరు కూర్చుండిన రెండు నిముషాలకు కొందరు గుమా స్తాలు వచ్చి సర్కారు కాగితాలను కట్టలకు కట్టలు వారిముందుంచి, ఒక్కొక్క దానిమీద నే వారిసంశకం పుచ్చుకొన్నారు. వ్రాలు చేయవలసిన కాగితాలు యెన్ని ఉన్నప్పటికీ, ప్రతి కాగి తాన్ని శ్రద్ధగా చూచి సంతకం చేసిరిగాని చదువకుండా సంగతి గ్రహించకుండా మాత్రము చేయలేదు. ఒక వేళ గుమాస్తాలు వేసుకొని వచ్చిన వుత్త రువులు తమకు తృప్తి కరంగా లేని యెడల వాటిని మారుస్తూవచ్చినారు. ఈ ప్రకారం ప్రొద్దున 8 గం టలనుండి సాయంకాలము 6 గంటలకు తమ ఆఫీనుపని పూర్తి చేసుకొన్న తర్వాత వీరి దర్శనార్థమై వచ్చిన వారు ఒక్కరో